Site icon TeluguMirchi.com

దేశంలో ఒక్కసారిగా పెరిగిన కేసులు

దేశంలో రోజురోజుకూ కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24గంటల్లో భారత్‌లో 1553 కొత్త కేసులు; 36 మరణాలు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. లా గోవాలో ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసులు లేవని ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ స్పష్టంచేశారు. కరోనా వైరస్‌ కేసులు రెట్టింపు లాక్‌డౌన్‌కు ముందు 3.4 రోజులుగా ఉండగా ఇప్పుడు 7.5గా ఉందన్నారు

ఇదీలావుంటే కేరళ, ఒడిశా రాష్ట్రాల్లోకరోనా తగ్గుముఖం పడుతోందని వెల్లడించింది. గత 14 రోజుల్లో 59 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదని తెలిపింది. కరోనా వైరస్‌ కేసులు రెట్టింపునకు ఏపీలో 10.6 రోజులు పడుతుండగా.. తెలంగాణలో 9.4 రోజులుగా ఉందని తెలిపింది.

Exit mobile version