Site icon TeluguMirchi.com

ముంబాయిని వణికిస్తున్న కరోనా

దేశ ఆర్థిక రాజధానిని కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. ఇవాళ ఒక్కరోజే ముంబయి నగరంలో 751 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,625కి చేరిందని బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. ఒకరోజులో ఇన్ని కేసులు నమోదు అవ్వడం ఇదే తొలిసారి .

అటు దేశ రాజధాని దిల్లీలో ఇవాళ ఒక్కరోజే 223 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,738కి చేరింది. ఇవాళ ఇద్దరు కరోనా కారణంగా మరణించారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

Exit mobile version