Site icon TeluguMirchi.com

దేశంలో కరోనా రికవరీ రేటు ఎంతో తెలుసా ?


భారత్‌లో కరోనా మహమ్మారి ఓ వైపు విజృంభిస్తుంటే.. మరోవైపు, రికవరీ రేటు కూడా క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో అత్యధికంగా 1074మంది కోలుకొన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు.

ఇప్పటివరకు భారత్‌లో 42,533 మంది కరోనా వైరస్‌ బారిన పడగా.. వారిలో 11,706 మంది కోలుకున్నారని చెప్పారు. దేశంలో రికవరీ రేటు 27.52శాతంగా ఉందని ఆయన తెలిపారు.

కాగా ఈ రోజు ఈ సాయంత్రం 5గంటల వరకు దేశ వ్యాప్తంగా మొత్తం 42,836 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. వీరిలో 11762 మంది కోలుకోగా.. 1389 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్రం తెలిపింది.

Exit mobile version