Site icon TeluguMirchi.com

ప్లాస్మా థెరపీ ఇంకా ప్రయోగ దశలోనే


భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో కరోనా బారిన పడినవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ రోజు సాయంత్రం 5గంటల సమయానికి దేశ వ్యాప్తంగా 29,974 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. వీరిలో 937మంది ప్రాణాలు కోల్పోగా.. 7027 మంది కోలుకున్నట్టు వెల్లడించింది.

గత 28 రోజుల్లో 17 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదన్నారు లవ్‌ అగర్వాల్‌ తెలిపారు . దేశంలో ప్లాస్మా థెరపీ ఇంకా ప్రయోగ దశలోనే ఉందనీ.. దీన్ని కరోనా చికిత్సకు ఉపయోగించవచ్చని ఎలాంటి ఆధారాలు లేవని ఆయన స్పష్టంచేశారు. దీనిపై ఐసీఎంఆర్‌ అధ్యయనం చేస్తోందని తెలిపారు.

Exit mobile version