
తెలంగాణలో కొత్తగా మరో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 12 కేసులు నమోదుకాగా.. మరో ముగ్గురు వలస కూలీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దీంతో రాష్ట్రంలో నమోదైన కేసులు 1,122కి చేరాయి. ఇవాళ కరోనా మహమ్మారి నుంచి కోలుకుని 45 మంది బాధితులు డిశ్చార్జ్ కాగా.. మొత్తం 693 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో 400 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
