
తెలంగాణలో ఈ రోజు 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,634కి చేరింది. ఈ రోజు తొమ్మిది మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు 1,011 మంది డిశ్చార్జి అయ్యారు.
కరోనాతో 38 మంది మృతి చెందగా, 585 మందికి చికిత్స అందిస్తున్నారు. ఈ రోజు నమోదైన కేసుల్లో 34 జీహెచ్‌ఎంసీలోనికాగా, 8 మంది మైగ్రెంట్స్. ఇప్పటివరకు 77 మంది మైగ్రెంట్స్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
