Site icon TeluguMirchi.com

తెలంగాణలో మరో 43 కేసులు

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో 43 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసులు 809కి చేరాయి. రాష్ట్రంలో ఐసోలేషన్‌ వార్డుల్లో 605 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనా బారిన పడి 18 మంది మృతి చెందగా 186 మంది డిశ్చార్జ్‌ అయ్యారని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇదీలావుంటే గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మహా నగరంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ రోజు కొత్తగా మరో 8 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు జీహెచ్ఎంసీ కమిషనర్‌ లోకేశ్ కుమార్‌ వెల్లడించారు. వీరిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.

Exit mobile version