Site icon TeluguMirchi.com

సెప్టెంబర్ కి కరోనా వ్యాక్సిన్

కరోనా వైరస్ వ్యాక్సిన్ సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు పరిశోధనలు నిర్విరామంగా కొనసాగుతుంది. కరోనా వైరస్కు సెప్టెంబర్ కల్లా టీకాను అందుబాటులోకి తెస్తామని విశ్వాసం వ్యక్తం చేసింది ఆక్స్ఫర్డ్ అనుబంధ సంస్థ జెన్నర్ ఇనిస్టిట్యూట్. సంస్థ చేసిన క్లినికల్ ట్రయల్స్లో అనుకున్న ఫలితాలు వచ్చాయని చెబుతున్న పరిశోధకులు.. మేలో 6 వేల మందిపై ప్రయోగానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

కరోనా వైరస్కు టీకా కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఆక్స్ఫర్డ్ అనుబంధ సంస్థ జెన్నర్ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. తమ పరిశోధకులు చేస్తోన్న క్లినికల్ ట్రయల్స్లో పురోగతి ఆధారంగా ఈ ప్రకటన చేసింది

Exit mobile version