
లాక్‌డౌన్ కారణంగా భారత్‌లో చిక్కుకుపోయిన పాకిస్థాన్ పౌరులు స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు భారత ప్రభుత్వం అనుమతించింది. దేశంలోని పది రాష్ట్రాల్లో ఉన్న పాక్ జాతీయులు అట్టారి-వాఘా సరిహద్దుల ద్వారా తమ దేశానికి తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది.
దేశంలో ఉన్న పాక్ జాతీయులు మే 5 ఉదయానికల్లా పాకిస్థాన్, భారత్‌ల సరిహద్దు ప్రాంతమైన అట్టారి-వాఘా బోర్డర్ వద్దకు చేరుకోవాల్సిందిగా , అక్కడి ఇమ్మిగ్రేషన్, సరిహద్దు చెక్‌పాయింట్ వద్ద తనిఖీ పూర్తయిన అనంతరం వారు స్వదేశానికి వెళ్లవచ్చని అధికారులు వివరించారు.
