
విశాఖలో పెను ప్రపమదం జరిగింది. నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకై 3 కి.మీ మేర వ్యాపించింది. దీంతో చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
తీవ్ర అస్వస్థతకు గురైన వారిలో ఇప్పటి వరకు 8మంది చెందినట్లు సమాచారం. ఆర్.ఆర్ వెంకటాపురంలో ముగ్గురు, విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఐదుగురు మృతి చెందారు. దాదాపు 200 మందికి పైగా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. అపస్మారక స్థితిలో రహదారిపై పడిపోయిన కొందరిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
