
ఇండియన్ ఫుట్ బాల్ టీమ్ కు కెప్టెన్ గా సేవలందించిన లెజండరీ ప్లేయర్ చున్నీ గోస్వామి(82) కన్నుమూశారు. కొన్నేళ్లుగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. కోల్ కతాలోని ఓ ఆస్పత్రిలో గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
చున్నీ గోస్వామికు భార్య, కుమారుడు ఉన్నారు. 1956- 64 మధ్య దేశం తరఫున 50 మ్యాచులు ఆడారు. ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ, అర్జున అవార్డుతో సత్కరించింది. గోస్వామి ఫస్ట్ క్లాస్ క్రికెటర్ కూడా కావడం విశేషం
