Site icon TeluguMirchi.com

పాతబస్తీ లో డాక్టర్ కు సోకినా కరోనా …

హైదరాబాద్ మహానగరం లో కరోనా బుసలు కొడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా తగ్గుతున్న వేళా గ్రేటర్ లో కరోనా కేసులు పెరుగుతునడం తో అధికారులను , నగర వాసులను నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా పాతబస్తీ లోని తలాబ్‌కట్ట ప్రాంతంలో ఓ డాక్టర్ కు కరోనా సోకడం అందర్నీ షాక్ లో పడేస్తుంది.

ఈ మధ్యనే పాతబస్తీలోని తలాబ్‌కట్ట ప్రాంతంలో ఓ మహిళ కరోనా వైరస్‌తో కన్నుమూసింది. అయితే, అనారోగ్యంపాలైన ఆమెను.. అంతకుముందే పలు ఆస్పత్రుల చుట్టూ తిప్పారు కుటుంబంసభ్యుల.. ఆమె మృతిచెందిన తర్వాత.. కరోనా పాజిటివ్‌గా వచ్చింది. దీంతో.. అప్రమత్తమైన అధికారులు.. కుటుంబసభ్యులకు టెస్ట్‌లు నిర్వహించగా.. ఆ కుటుంబంలోని 17 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇక, పాతబస్తీలో ఓ డాక్టర్, నర్స్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది..తలాబ్‌కట్టకు చెందిన ఆ మహిళకు చికిత్స చేశారు ఈ డాక్టర్, నర్స్.. మరోవైపు, ఆ మహిళ ఫ్యామిలీకి చెందిన 17 మందికి చికిత్స కొనసాగుతుండగా.. మహిళలకు చికిత్స చేసిన వారందరినీ క్వారంటైన్‌లో పెట్టారు అధికారులు. మొత్తం మీద ఓ మహిళా కు వచ్చిన కరోనా ఇప్పుడు అంధరి మడత పెట్టింది.

Exit mobile version