Site icon TeluguMirchi.com

ఏపీ లో ఆగని కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడమే తప్ప తగ్గడం ఎక్కడ లేదు. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు చూసి ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి… దీంతో, రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 647కు చేరింది.

ఈ 44 కేసుల్లో అత్యధికంగా 26 కరోనా పాజిటివ్ కేసులు కర్నూల్ లో నమోదు కాగా.. అనంతపురంలో 3, విశాఖలో 1, కృష్ణాలో 6, పశ్చిమగోదావరిలో 5, గుంటూరులో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 158 పాజిటివ్‌ కేసులో కర్నూలులో నమోదు కగా.. 129 పాజిటివ్ కేసులతో తర్వాతి స్థానంలో గుంటూరు జిల్లా ఉంది. ప్రస్తుతం 565 మంది చికిత్స పొందుతుండగా… ఇప్పటి వరకు 17 మంది కరోనా తో కరణించారని ఆరోగ్య శాఖ తెలిపింది.

Exit mobile version