
కరోనా మహమ్మారి భారత్ లో రోజు రోజుకు విపరీతం అవుతుంది. కరోనా పాజిటివ్ కేసులు అన్ని జిల్లాలో భారీ సంఖ్య లో నమోదు అవుతుండడం తో కేంద్రానికి ఏంచేయాలో తోచడం లేదు. ఇప్పటికే లాక్ డౌన్ తేదీని మరోసారి పొడగించి కరోనా కట్టడి చేయాలనీ చేస్తుండగా..కేసులు మాత్రం పెరుగుతుండడం పెద్ద తలనొప్పిగా మారింది.
రెండు రోజుల నుంచి కరోనా కేసులు రెండు వేలు దాటిపోతున్నాయి. నిన్నటి రోజున 2400 వరకు కరోనా కేసులు నమోదుకాగా, ఈరోజు 2644 కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో భారీ ఎత్తున కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల్లో 682 మంది డిశ్చార్జ్ కాగా, 83 మంది మరణించినట్టు హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు. ఇండియాలో మొత్తం ఇప్పటి వరకు 39,980 కరోనా కేసులు నమోదయ్యాయి.
