
లాక్ డౌన్ 4 కు వచ్చినప్పటికీ ఇండియా లో మాత్రం కరోనా పాజిటివ్ కేసులు తగ్గడం లేదు. రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కేంద్రం కుటుంబ, ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 5,242 కొత్త కేసులు నమోదు అయ్యాయి.
ఒకేరోజు ఇంత భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదేతొలిసారి. దీంతో.. దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 96,169కు చేరింది.. మరోవైపు గత 24 గంటల్లో 157 మంది మృతిచెందడంతో.. ఇప్పటివరకు మృతిచెందినవారి సంఖ్య 3,029కు పెరిగింది.
