Site icon TeluguMirchi.com

కరోనా కు అసలైన మందు ‘మద్యమే’..

కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా నిత్యావసరాల షాప్స్ , మెడికల్ షాప్స్ ఇవి మాత్రమే ఓపెన్ కాగా మిగతావన్నీ మూతపడ్డాయి. ముఖ్యంగా వైన్ షాప్స్ బంద్ కావడం తో మందు బాబుల కష్టాలు అన్ని ఇన్ని కావు. మందు కు బానిసైన వారు గత కొన్ని రోజులుగా మద్యం దొరకకపోయేసరికి పిచ్చి పట్టినట్లు, మతిస్తిమితం కోల్పోయినట్లు ప్రవర్తిస్తున్నారు. మరికొన్ని చోట్ల తట్టుకోలేక ఆత్మహత్యలు, చాకులతో గొంతు కోసుకుంటున్న ఘటనలు బయటకొచ్చాయి. ఎప్పుడెప్పుడు లాక్ డౌన్ ఎత్తేస్తారో..ఎప్పుడెప్పుడు మద్యం షాపులు ఓపెన్ చేస్తారో అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

ఆల్కాహాల్ తాగడం వలన గొంతులో ఉండే కరోనా వైరస్ చనిపోతుందని రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ సింగ్ అన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో వెంటనే మద్యం దుకాణాలను తెరవాలని సీఎం అశోక్ గెహ్లాత్‌కు ఆయన లేఖ రాశారు. వైన్ షాప్‌లను మూసివేయడం వల్ల రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు కూడా ఆదాయం తగ్గిపోయిందని లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు కొందరు కల్తీ మద్యం తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని, బ్లాక్ మార్కెట్‌లో మూడు రెట్లకు మద్యం అమ్ముతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో మద్యం షాపులను తెరిస్తే వీటన్నింటికీ చెక్ పెట్టవచ్చని అభిప్రాయపడ్డారు.

Exit mobile version