Site icon TeluguMirchi.com

న్యూయార్క్ అంటే వణికిపోతున్నారు…

మొన్నటి వరకు న్యూయార్క్ అంటే అంత ఎప్పుడు వెళ్తామా..అక్కడ ఎప్పడు జాబ్ చేస్తామా అని అనుకోవడం..కోరుకోవడం చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పేరు చెపితే వణికిపోతున్నారు. దీనికి కారణం కరోనా. కరోనా వైరస్ న్యూయార్క్ ను అతలాకుతలం చేస్తుంది. ఇప్పట్లో న్యూయార్క్ పూర్వ వైభవం తెచ్చుకోవడం కష్టమే అంటున్నారు. అమెరికాలో మొత్తం 5,60,443 మంది కరోనా బారిన పడ్డారు. 22,115 మంది మరణించారు.

ఒక్క న్యూయార్క్ నగరంలోనే 1,89,415 మందికి ఈ వైరస్ ఎటాక్ అవ్వగా, అందులో 9,385 మంది మరణించారు. ఈ స్థాయిలో మరణాలు సంభవించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంత భారీ ఎత్తున న్యూయార్క్ లో కరోనా మరణాలు సంభవించడం , కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం వెనుక న్యూయార్క్ నగరాన్ని సగటున ఏడాదికి 60 లక్షలమందికి పైగా పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఈ నగరానికి తాకిడి ఎక్కువగా ఉండటంతో అమెరికాలో ఎక్కువ ఎఫెక్ట్ అయ్యిన నగరంగా న్యూయార్క్ నిలిచింది. అందుకే ఇప్పుడు న్యూయార్క్ పేరు చెపితే భయపడిపోతున్నారు.

Exit mobile version