
ఇండియా లో కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్ప ఎక్కడ కూడా తగ్గడం లేదు. ప్రస్తుతం దేశంలో వైరస్ కేసుల సంఖ్య 9000 వేలు దాటింది. గడచిన వారం రోజులుగా రోజుకు సగటున 1,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా దాదాపు 1,000 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 222, తమిళనాడులో 106, రాజస్థాన్‌లో 104, ఢిల్లీలో 85 కేసులు నమోదయ్యాయి.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే..తెలంగాణ రాష్ట్రం లో ఆదివారం కొత్తగా 28 పాజిటివ్ కేసులు నమోదు కావడం తో మొత్తం 531కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ మరో 22 కేసులు ఆదివారం నిర్దారణ కాగా.. ఒకరు మృతిచెందారు. దీంతో ఏపీలో కరోనా కేసులు 427కి చేరుకోగా.. ఇప్పటి వరకు ఏడుగురు ఈ మహమ్మారికి బలయ్యారు. కర్నూలు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరులో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం మరో రెండు రోజుల్లో లాక్ డౌన్ పూర్తి కావోస్తుండడం తో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. కేంద్రం కూడా లాక్ డౌన్ పొడిగించే ఆలోచనలో ఉంది.

