
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికా, జర్మనీ, బ్రిటన్, చైనా సహా పెద్ద దేశాలన్నీ క్లినికల్ ట్రయల్స్ కూడా మొదలు పెట్టే పనిలో ఉన్నాయి.
పూణెకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా అదే పనిలో ఉంది. ఈ కంపెనీ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే రూ.వెయ్యికే వ్యాక్సిన్ అందజేస్తుందట. ఈ మేరకు ఆ కంపెనీ సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి రెండు నుంచి నాలుగు కోట్ల డోసులను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అదర్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 1,140 కోట్లను వెచ్చిస్తున్నామని చెప్పుకొచ్చారు.
