Site icon TeluguMirchi.com

ఐదు సెకన్లలో కరోనాని గుర్తించే సాఫ్ట్ వేర్


కరోనా వైరస్ ను వేగంగా గుర్తించే సాంకేతికతను అభివృద్ధి చేయడంలో తలమునకలుగా వుంది ప్రపంచం. ఈ క్రమంలో ఐఐటీ రూర్కీకి చెందిన ఓ ప్రొఫెసర్ 5 సెకన్లలో కొవిడ్-19 వైరస్ ను గుర్తించే సరికొత్త సాఫ్ట్ వేర్ కు రూపకల్పన చేశారు. అనుమానిత రోగికి ఎక్స్ రే స్కాన్ తీయడం ద్వారా కొన్ని నిమిషాల వ్యవధిలోనే రోగ నిర్ధారణ చేయవచ్చని సదరు ప్రొఫెసర్ అంటున్నారు.

ఐఐటీ రూర్కీలో కమల్ జైన్ సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. కొత్త పరీక్ష విధానం కోసం 40 రోజుల పాటు శ్రమించిన జైన్, తన సాఫ్ట్ వేర్ పై పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అంతేకాదు, తన పరిశోధనలపై సమీక్షించాల్సిందిగా భారతీయ వైద్య మండలి ని కోరారు. దీనిపై ప్రొఫెసర్ జైన్ స్పందిస్తూ, తన సాఫ్ట్ వేర్ తో కరోనా పరీక్షల ఖర్చు గణనీయంగా తగ్గడమే కాకుండా, వైద్య సిబ్బందికి కరోనా సోకే ప్రమాదం కూడా తక్కువ అని వెల్లడించారు.

Exit mobile version