
మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ను సమూలంగా నాశనం చేసిన తర్వాతే క్రికెట్‌ను తిరిగి ప్రారంభించాలని అభిప్రాయపడ్డాడు. ‘‘కరోనా నుంచి ముందుగా మన దేశాల్ని, ప్రపంచాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఇది పెరిగే కొద్ది ఆటగాళ్లు బయటకు రావడానికి, మైదానాలకు వెళ్లడానికి, డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండటానికి భయపడతారు. దేశానికి ప్రాతినిధ్యం వహించేటప్పుడు ఎంతో ఒత్తిడి ఉంటుంది. దానికి తోడుగా కరోనా భయం ఉండకూడదు’’అన్నాడు యువీ
