Site icon TeluguMirchi.com

మరో 68మంది జవాన్స్ కి కరోనా


దిల్లీలోని సీఆర్పీఎఫ్‌ బెటాలియన్‌లోని మరో 68మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు సీఆర్పీఎఫ్‌లో ఈ మహమ్మారి సోకిన జవాన్ల సంఖ్య 127కి పెరిగింది. వీరిలో ఒకరు మృతిచెందగా.. మరొకరు డిశ్చార్జి అయ్యారు.

కాగ భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో దేశంలో 2411 కొత్త కేసులు 71 మరణాలు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 37,776 మందికి ఈ వైరస్‌ సోకినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఈ వైరస్‌ సోకినవారిలో 10018 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 1223 మంది మృతిచెందారు.

Exit mobile version