
మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భవితవ్యం ఐపీఎల్ పైనే ఆధారపడింది. మహీ ఆటకు దూరమై ఏడాది కావస్తోంది. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో సెమీఫైనల్లో చివరి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత జట్టుకు దూరమై కుటుంబంతో సేదతీరుతున్నాడు.
ఈ క్రమంలోనే ఐపీఎల్‌తో రీఎంట్రీ ఇచ్చి మళ్లీ భారత జట్టులో తన సత్తా చూపిస్తాడని అంతా ఆశించారు. కానీ, కరోనా దెబ్బతో ఐపీఎల్ వాయిదా పడటం, ఈ నేపథ్యంలోనే ధోనీ రిటైర్మెంట్‌పై వార్తలు రావడం అతని అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. కాగా, ఈ విషయంపై ధోనీ మేనేజర్ మిహిర్ దివాకర్ తాజాగా ఓ స్పష్టత ఇచ్చాడు. మహీకి ఇప్పుడప్పుడే రిటైర్మెంట్ ఆలోచనలు లేవన్నాడు.
