Site icon TeluguMirchi.com

పెను తుపానుగా ఎంఫాన్


ఎంఫాన్ తుపాను ఒడిశా, పశ్చిమబెంగాల్ పై విరుచుకుపడింది. బంగ్లాదేశ్ ను అతలాకుతలం చేస్తోంది. 1999 తర్వాత ఒడిశా ఎదుర్కొన్న పెను తుపాను ఇదే కావడం గమనార్హం. ఎంఫాన్ తుపాను ప్రభావానికి ఒకానొక సమయంలో గంటకు 220 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.

అయితే తీరం దాటే సమయానికి కొంచెం శాంతించడంతో 160 కిలోమీటర్లకు పరిమితమైంది. లేకపోతే పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. అయితే ఎంఫాన్ అతి కొద్ది సమయంలోనే కేటగిరీ 1 నుంచి కేటగిరీ 5 పెను తుపానుగా మారడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై శాస్త్రవేత్తలు స్పందిస్తూ, పర్యావరణ మార్పులే దీనికి కారణమని చెబుతున్నారు.

Exit mobile version