Site icon TeluguMirchi.com

మద్యం షాపుల దగ్గర అమ్మాయిలు…ఎక్కడంటే

లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా మద్యం షాపులు బంద్ కావడం తో మందు ప్రియులు తట్టుకోలేకపోయారు. బ్లాక్ లో వేలు పోసి మద్యం కోలుగోలు చేసారు. మరికొంతమంది మద్యం దొరకక పోవడం తో పిచ్చోళ్ళు అయ్యారు. ఇక ఈరోజు నుండి అన్ని జోన్లలో మద్యం అమ్మకాలు ప్రారంభం మొదలు కావడం తో మందు బాబులు పండగ చేసుకుంటున్నారు. ఉదయం నుండే అన్ని వైన్ షాపుల దగ్గర భారీగా జనాలు క్యూ కట్టారు.

కాగా వారిలో అమ్మాయిలు కూడా ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బెంగళూరులో ఓ మద్యం దుకాణం ఎదుట.. మహిళలు క్యూలో నిలిచినున్న ఫొటో ఒక్కటి ఒప్పుడు వైరల్‌గా మారింది. అయితే, మహిళల కోసం ప్రత్యేక క్యూ లైన్‌ ఏర్పాటు చేసి.. కాస్త వాళ్లకు ఇబ్బంది లేకుండా లైన్‌ క్లియర్ చేశారు నిర్వాహకులు. అయితే, మహిళలు తాగడం మామూలు విషయమే.. బెంగళూరు లాంటి నగరాల్లో అది మరీ ఎక్కువ.. పబ్స్‌కు వెళ్లి మద్యం కిక్కులో డ్యాన్స్‌లు కూడా చేస్తుంటారు.. కానీ, ఇప్పుడు పబ్స్‌, రెస్టారెంట్లు.. అన్ని క్లోజ్ కావడంతో.. అమ్మాయిలు కూడా ఇప్పుడు వైన్‌షాపుల ముందు క్యూ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది.

Exit mobile version