Site icon TeluguMirchi.com

వర్క్‌ ఫ్రమ్ ‘సెక్స్’‌ హోమ్..

కరోనా వైరస్ కారణంగా పలు సంస్థలు తమ ఉద్యోగులను ఇంటివద్ద నుండి పనిచేయమని చెపితే..చాలామంది పనితో పాటు శృంగారపని కూడా చేస్తున్నారు. చేస్తే చేయనివ్వండి కానీ ఏదో ప్రవైట్ గా చేసుకుంటే పర్వాలేదు…ఏకంగా లైవ్ కెమెరా ముందు చేసుకుంటూ పబ్లిక్లో పడుతున్నారు.

ఫిలిప్పిన్స్‌లోని మనీలాలో ఇలాగే తన సెక్రటరీతో జూమ్‌ లైవ్‌లో సెక్స్‌లో పాల్గొంటూ దొరికిపోయాడో ప్రభుత్వ అధికారి. జీసన్‌ ఎస్టిల్‌ అనే ఓ అధికారి తన గ్రామ కౌన్సిల్‌ సభ్యులతో జూమ్‌లో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.. ఆయనకు టెక్నాలజీ మీద అంతగా పట్టులేదు.. కాన్ఫరెన్స్‌ అంతా అయ్యాక ఓ బటన్‌కు బదులు మరో మీట నొక్కేసి అంతా ఆఫ్‌ అయ్యిందనుకున్నాడు.. కెమెరా మాత్రం రన్నింగ్‌లో ఉందన్న సంగతి తెలుసుకోలేకపోయాడు.. అటు పిమ్మట తన సెక్రటరీతో శృంగారంలో పాల్గొన్నాడు.. ఇదంతా జూమ్‌ లైవ్‌లో ఉన్నవారికి స్పష్టంగా కనిపిస్తున్నా… అతడికి మాత్రం ఆ విషయం తెలియలేదు.. కాసేపయ్యాక సెక్రటరీకి ఎందుకో అనుమానం వచ్చేసి అతడికి విషయం చెప్పింది.. వెంటనే తేరుకున్న ఆ పెద్దమనిషి కెమెరా ఆఫ్‌ చేశాడు.. అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Exit mobile version