Site icon TeluguMirchi.com

20 వేలకు పరుగులు పెడుతున్న కరోనా కేసులు

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఓ పక్క కేంద్రం లాక్ డౌన్ పొడిగిస్తూ కరోనా ను కట్టడి చేయాలనీ ఎంత ట్రై చేస్తున్నప్పటికీ దేశంలోని అన్ని రాష్ట్రాలలో వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో అధికారులు , ప్రజలు ఖంగారు పడుతున్నారు.

గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,383 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటివరకు 640 మంది కరోనా తో మరణించారని.. దేశవ్యాప్తంగా ఇప్పుడు కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 19,984కు చేరుకున్నట్లు తెలిపింది.భారత్‌లో ప్రస్తుతం 15,474 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు కరోనాబారిన పడి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 3,870గా ఉంది.

Exit mobile version