Site icon TeluguMirchi.com

ఇవాంక మనసు దోచిన బీహార్ అమ్మాయి

బీహార్ బాలిక జ్యోతి సాహ‌సానికి అమెరికా బ్యూటీ ఫిదా అయింది. లాక్‌డౌన్‌లో హ‌ర్యానాలోని గుర్‌గ్రాం నుంచి బిహార్‌లోని దుర్భంగా జిల్లాకు సైకిల్‌పై తండ్రిని కూర్చో పెట్టుకుని 1200 ప్ర‌యాణించిన 15 ఏళ్ల జ్యోతి గురించి తెలుసుకున్న అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కూమర్తే ఇవాంక ట్రంప్ ఆశ్చ‌ర్యంతో పాటు ఆనందానికి లోన‌య్యారు.

”15 ఏళ్ల జ్యోతి కుమారి గాయపడిన తన తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకొని ఏడు రోజుల పాటు 1200 వందల కిలోమీటర్ల ప్రయాణం చేయడం అత్యంత అద్భుతమనే చెప్పాలి. భారతీయ ప్రజల్లో ఇంత ఓర్పు, సహనం, ప్రేమ ఉంటాయనేది ఈమె ద్వారా నాకు తెలిసింది” అంటూ ట్వీట్‌ చేశారు.

Exit mobile version