Site icon TeluguMirchi.com

ఏపీ ఉద్యోగులకు పూర్తి వేతనాలు


కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. దాంతో ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వేతనాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వాలు ఉంటున్నాయి. ఏపీలోనూ అదే పరిస్థితి నెలకొంది. అయితే, ఇకమీదట ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల్లో కోత ఉండదని ఏపీ సర్కారు పేర్కొంది.

దీనికి సంబంధించి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. మే నెల నుంచి ఉద్యోగులకు పూర్తి జీతం ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ, ట్రెజరీ విభాగాలకు ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది.  

Exit mobile version