
కరోనాపై నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. . కాగా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల కొనుగోళ్లలో జగన్ సర్కారు అవినీతి తెరతీసిందనే ఆరోపణలు వచ్చాయి.
దీనిపై ఏపీ ప్రభుత్వం స్పదించింది. పారదర్శకంగా కరోనా వైరస్ ర్యాపిడ్ కిట్ల కొనుగోళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. కిట్ల కొనుగోలులో ఒక్క రూపాయి కూడా వృథా కాలేదని చెప్పారు. దక్షిణ కొరియా నుంచి ఏపీ ప్రభుత్వం ఒక్కో కిట్‌కు రూ. 730 చొప్పున లక్ష కిట్లను దిగుమతి చేసుకుంది. అదేవిధంగా రెండు లక్షల కిట్ల కొనుగోలుకు ఇచ్చిన పర్చేజ్ ఆర్డర్‌లో ప్రభుత్వం ప్రత్యేకమైన క్లాజ్ను పెట్టింది. దేశంలో ఎవరకి తక్కువ ధరకి అమ్మితే అదే ధరను చెల్లిస్తామని షరతు కూడా విధించింది.
