Site icon TeluguMirchi.com

జియో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ప్లాన్

రిలయన్స్ జియో సరికొత్త ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటి నుంచి పని చేస్తున్న వారి కోసం ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ప్లాన్ ను ప్రారంభించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ. 2,121 ప్లాన్ కు అదనంగా రూ. 2,399తో మరో ప్లాన్ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కాలపరిమితి 336 రోజులు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ. 2,121 ప్లాన్ లో రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ కాలపరిమితి కూడా 336 రోజులే. కొత్తగా ప్రవేశపెట్టిన రూ. 2,399 ప్లాన్ తో రోజుకు 2 జీబీ డేటా వినియోగించుకోవచ్చు.

Exit mobile version