Site icon TeluguMirchi.com

ఏపీ కరోనా కేసుల్లో ఆ జిల్లా ఫస్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి బుసలు కొడుతుంది. ముఖ్యంగా కర్నూల్ లో కరోనా వైరస్ విపరీతంగా ఉంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో అత్యధిక కేసులు కర్నూల్ లో నమోదు అయ్యాయి. జిల్లావ్యాప్తంగా 77 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లావాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో లాక్డౌన్ను మరింత పటిష్టంగా అమలు చేస్తున్నారు పోలీసులు.

అలాగే కర్నూల్ తర్వాత అత్యధికంగా గుంటూరు లో నమోదు అయ్యాయి. గుంటూరు జిల్లాలో కరోనా కేసులు హాఫ్ సెంచరీ దాటాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 58 కేసులు నమోదయ్యాయి. మర్కజ్ నిజాముద్దీన్ సదస్సుకు వెళ్లివచ్చిన వారి వల్లే కేసులు పెరుగుతుండటంతో అధికారులు వారిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. విదేశీ ముస్లింలు గుంటూరు తలదాచుకున్నారన్న సమాచారంతో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

Exit mobile version