Site icon TeluguMirchi.com

ఇండియన్‌ నేవీలో కరోనా కలకలం


భారత నావికాదళంలో కరోనా కలకలం రేపింది. 21 మంది నావికాదళ సిబ్బందికి కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. వైరస్‌ సోకినప్పుడు వీరంతా ‘ఐఎన్‌ఎస్‌ యాంగ్రీ’కి చెందిన నివాస స్థావరాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వీరిని ముంబయిలోని ఐఎన్‌హెచ్‌ఎస్‌ అశ్వినీ నేవీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నట్లు సమాచారం. భారత నేవీలో కరోనా కేసులు వెలుగులోకి రావడం ఇదే తొలిసారి. దీంతో అప్రమత్తమైన అధికారులు వైరస్‌ సోకిన వారితో కలిసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. అలాగే ఆ చుట్టుపక్కల విధులు నిర్వర్తించిన సైనికుల్ని కూడా గుర్తించేందుకు యత్నిస్తున్నారు.

ఐఎన్‌ఎస్‌ అంగ్రే నావెల్‌ బేస్‌లో ఏప్రిల్‌ 7న ఒకరికి కరోనా సోకింది. అతన్ని నుంచి మిగతా వారికి కరోనా వ్యాప్తి చెందినట్లు నేవీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. నేవీలో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఐఎన్‌ఎస్‌ అంగ్రేను లాక్‌డౌన్‌ చేశారు.

Exit mobile version