
దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య 20వేలు దాటింది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు దేశంలో ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 20,471కి చేరింది. కొత్తగా 49 మంది ప్రాణాలు కోల్పోయినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తాజా మరణాలతో కలుపుకుని మొత్తం మరణాల సంఖ్య 652కు పెరిగింది. అలాగే, ఇప్పటి వరకు 3,959 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
కాగ దేశంలో అత్యధిక కేసులు, మరణాలతో మహారాష్ట్ర ముందుంది. అక్కడ ఇప్పటి వరకు 5,221 కేసులు నమోదు కాగా, 251 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,272 కేసులు, 95 మరణాలతో గుజరాత్ ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఢిల్లీలో 2,156, రాజస్థాన్‌లో 1,801 , తమిళనాడులో 1,596, మధ్యప్రదేశ్‌లో 1,592, ఉత్తరప్రదేశ్‌లో 1,412 కేసులు నమోదయ్యాయి.
