Site icon TeluguMirchi.com

కరోనా పై “నారాయణ” మంత్రం.. అద్భుతం

WhatsApp Image 2020 04 03 at 8.29.16 PM


నారాయణ విద్యాసంస్థలు అద్భుతమైన బాటలో నడుస్తున్నాయి. కరోనా నేపధ్యంలో దేశం మొత్తం విధించిన లాక్‌డౌన్‌తో విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకూడదని నారాయణ విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ క్లాసులకు శ్రీకారం చుట్టా యి. ఈ క్లాసుల ద్వారా టీచర్‌ చెప్పే పాఠ్యాంశాలను నేరుగా ఇంట్లోనే వినవచ్చు. సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

డైలీ అసైన్‌మెంట్లు కూడా ఇందులోనే ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లోనే పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సౌకర్యాన్ని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్రాంచీల పరిధిలో అమలు చేస్తున్నారు. రోజుకు సగటున పదివేల మందికి పైగా విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులను వీక్షిస్తున్నారని, మొత్తంగా 75 వేల మందికి పైగా విద్యార్థులు ఈ నిర్ణయంతో లబ్ధి పొందుతున్నారని సమాచారం. ఇలాంటి సమయంలో కూడా పిల్లలు టీవీ లకి అతుక్కుపోకుండా ఇలాంటి ప్రయత్నం చేయడం అభినందనీయం.

Exit mobile version