
ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మరణించాడని అంతర్జాతీయ మీడియా సంస్థల్లో కథనాలు వస్తున్నాయి. గత కొన్నాళ్లుగా కిమ్ ఆరోగ్యం గురించిన వదంతుల గురించి తెలిసిన సంగతే. కిమ్ కు హార్ట్ సర్జరీ జరిగిందని, చికిత్స వైఫల్యంతో ఆయన బ్రెయిన్ డెడ్ స్టేజ్ కు చేరాడని కథనాలు వస్తున్నాయి
శనివారం ఉత్తర కొరియా సైన్యం వ్యవస్థాపిత దినోత్సవం సందర్భంగానూ ఆయన కనిపించకపోవడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. అయితే అమెరికా నిఘా విభాగం మాత్రం కిమ్ విషమ పరిస్థితుల్లో ఉన్నారన్న వార్తల్ని కొట్టిపారేస్తోంది. ఉత్తర కొరియాలో ఎలాంటి హడావుడి మిలిటరీ కార్యకలాపాలు చోటుచేసుకుంటున్న సంకేతాలు లేవని తెలిపింది.
