
తెలంగాణ పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ గొప్ప మనసు చాటుకున్నారు. కరోనా నియంత్రణలో విశిష్ట సేవలందిస్తున్న పారిశుద్ధ్య, ఎంటమాలజీ, డీఆర్‌ఎఫ్ సిబ్బందికి భోజనం పెట్టారు. నగరంలోని సంజీవయ్య పార్కు ఎదురుగా ఉన్న డీఆర్‌ఎఫ్ శిక్షణా కేంద్రంలో శానిటేషన్, డీఆర్ఎఫ్, ఎంటమాలజీ సిబ్బందితో కలిసి కేటీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు. లాక్డౌన్ సమయంలో వైద్యులు, పోలీసులకు దీటుగా పనిచేస్తున్నారని వారిని అభినందించారు.
కరోనా నియంత్రణలో విశిష్ట సేవలందిస్తున్న పారిశుద్ధ్య, ఎంటమాలజీ, డీఆర్‌ఎఫ్ సిబ్బందికి పూర్తి వేతనంతో పాటు ప్రోత్సాహకాలను సీఎం కేసీఆర్ అందజేస్తున్నారని గుర్తుచేశారు.
ఇదీలావుంటే తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్ గడువును 14 నుంచి 28 రోజులకు పెంచింది. కేవలం ప్రైమరీ కాంటాక్టులకే కరోనా పరీక్షలు చేయాలని అధికారులకు సూచించింది.
