Site icon TeluguMirchi.com

స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు గ్రీన్ సిగ్నల్

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. గ్రీన్‌ జోన్లలో అన్ని కార్యకలాపాలకు అనుమతించిన కేంద్రం.. ఆరెంజ్‌ జోన్లలో కొన్ని మినహాయింపులు ఇచ్చింది.

గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో ఆన్‌లైన్‌ ద్వారా నిత్యావసర సరుకులే కాకుండా ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వంటి ఇతర వస్తువుల విక్రయాలకు కూడా ప్రభుత్వం అనుమతించింది. ఈ కామర్స్‌ దిగ్గజాలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫాంల ద్వారా గతంలో నిత్యావసర సరుకుల డెలివరీకే గతంలో అనుమతించిన ప్రభుత్వం ఈసారి గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో పూర్తిస్ధాయిలో ఈకామర్స్‌ సేవలకు అనుమతించింది.

Exit mobile version