
విశాఖపట్నంలో ఎల్‌జీ పాలిమర్ గ్యాస్ లీకేజ్ ఘటనలో బాధితులకు గుర్తింపు పొందిన ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స అందజేస్తే వైద్య ఖర్చులను పూర్తిగా వైఎస్‌ఆర్ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ చెల్లిస్తుందని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. విశాఖతో పాటు గ్యాస్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న గుర్తింపు పొందిన ఏ ప్రైవేటు ఆస్పత్రిలోనైనా బాధితులు ఎటువంటి ఫీజు చెల్లించకుండానే వైద్య సేవలను పొందవచ్చు.
కాగా గ్యాస్ లీకేజీ దుర్ఘటన నేపథ్యంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు గోపాలపట్నం పోలీసులు పలు సెక్షన్ల కింద ఆ సంస్థపై కేసులు నమోదు చేశారు. సెక్షన్ 337, 338, 304 కింద కేసులు నమోదు చేసినట్లు గోపాలపట్నం పోలీసులు తెలిపారు.
