
కరోనా కట్టడిలో భాగంగా కేంద్రం ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని..మాస్క్ లేకుండా బయటకు వస్తే భారీ ఫైన్ కట్టాలని చెపుతుండడం ..కరోనా భారిన పడకుండా మాస్క్ తప్పనిసరి అని చాలామంది మాస్క్ లు ధరించుకుంటున్నారు. లాక్ డౌన్ కాలంలో ఇంట్లో ఖాళీగా ఉండలేక తమ టాలెంట్ ను సోషల్ మీడియా ద్వారా చూపిస్తూ అబ్బా అనిపిస్తున్నారు.
తాజాగా వెరైటీ మాస్కులు తయారు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా కొంతమంది లిక్కర్ మాస్కులు అని తయారు చేస్తున్నారు. మాములు జీన్ ప్యాంట్ ముందు భాగం చించేసి మాస్కులు తయారు చేస్తున్నారు. పైన బటన్ ముందు జిప్పు ఉంటుంది. బీర్ తాగాలి అనుకుంటే, మాస్క్ ముందు ఉన్న జిప్ ఓపెన్ చేసి బీర్, కూల్ డ్రింక్ తాగెయ్యొచ్చు. బాటిల్ బయట పడేసి మరలా జిప్ వేసుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం ఈ మాస్క్ ట్రెండ్ సృష్టిస్తుంది.
