
మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దేశంలో అత్యధికంగా ఈ రాష్రంలోనే కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ముంబై, పుణెల్లో కరోనా కేసుల ఉధృతి బాగా ఉంది మహారాష్ట్రలో వైరస్ ఉదృతి ఇలా కొనసాగితే లాక్ డౌన్ ను జూన్ చివరి నాటికి పొడగించే అవకాశమున్నదని సమాచారమ్. ఇందుకుగాను మహారాష్ట్రలోని ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇదే విషయాన్ని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. లాక్‌డౌన్ పొడగించకుంటే పరిస్థితి చేజారిపోయే ప్రమాదం ఉందంటూ హెచ్చరిస్తున్నారు.
ఇక దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు శనివారం కూడా భారీ సంఖ్యలో నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. గడచిన 24 గంటల్లో 1490 కొత్త కేసులు రాగా, 56 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లో ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 24,942కు, మొత్తం మరణాల సంఖ్య 779కు చేరుకుంది
