
ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాల దేశాలు లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను ఇంటికే పరిమితం చేసాయి. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావడం లేదు. ఈ సమయంలో వారి ప్రాణాలు లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలు కాపాడడం లో కీలక పాత్ర పోషిస్తున్న డాక్టర్స్ , పోలీస్ , పారిశుధ్య కార్మికులకు అంత సెల్యూట్ చేస్తున్నారు.
లాక్ డౌన్ సమయంలో రాత్రింబవళ్లు పోలీసులు విధులు నిర్వహిస్తూ నిబంధనలు అమలయ్యేలా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ మహిళ పోలీసులకు కూల్ డ్రింకు బాటిళ్లు ఇస్తుండగా తీసిన వీడియో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
లాక్‌డౌన్ విధులు నిర్వహిస్తోన్న పోలీసులకు ఓ మహిళ కూల్ డ్రింకులు సీసాలు అందించింది. మొదట థమ్సప్ బాటిల్‌ను ఆమె పోలీసులకు ఇచ్చింది. అనంతరం ఫంటా బాటిల్‌ను కూడా తీసి ఇవ్వబోయింది. ఆమె జీతం ఎంతా? అని ఆమెను పోలీసులు అడిగారు. దానికి ఆమె 3,500 రూపాయలు అని చెప్పింది. అంత తక్కువ జీతం పొందుతోన్న ఆమె తమకు సేవ చేయాలనుకోవడంపై పోలీసులు ప్రశంసలు కురిపించారు. ఆమెది చాలా పెద్ద మనసు అని అన్నారు. చివరకు వాటిని పోలీసులు తీసుకోలేదు.
‘లాక్‌డౌన్ నేపథ్యంలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన ఈ దృశ్యాలు మానవత్వంపై మనలో తిరిగి నమ్మకాన్ని నింపేలా ఉన్నాయి. ఆమె ఇస్తున్న స్ఫూర్తిని అభినందిస్తున్నాను. మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన చిరునవ్వులు చిందిస్తూ ఆమె పోలీసులకు వాటిని అందించాలనుకుంది’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.
It is visuals like these during the lockdown that restore our faith in humanity. Truly appreciate her spirit of giving and that priceless, pure-hearted smile. pic.twitter.com/FrINll7smJ
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) April 15, 2020
