Site icon TeluguMirchi.com

అయ్యో.. ప్రధాన నగరాలన్నీ రెడ్ జోన్ లోనే

దేశంలోని ప్రధాన నగరాలన్నీ రెడ్‌జోన్‌లోనే ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు, అహ్మదాబాద్‌తో పాటు దిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌, నోయిడా, మీరట్‌ రెడ్‌జోన్‌లోనే ఉన్నాయని స్పష్టంచేసింది. గుడ్‌గావ్‌, ఘజియాబాద్‌ మాత్రం ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నాయని కేంద్రం తెలిపింది.

కరోనా కట్టడిపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కీలక సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి హోంమంత్రి అమిత్‌ షా, రైల్వే, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌, కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా హాజరయ్యారు. లాక్‌డౌన్‌ కొనసాగింపు, కరోనా కట్టడి చర్యలపై ప్రధాని వీరితో చర్చిస్తున్నారు.

Exit mobile version