Site icon TeluguMirchi.com

ఆ మాత్రలు ఇంక అంత ఈజీ కాదు

జ్వరం, జలుబు, దగ్గు మాత్రలు ఇంక అంత సులువుగా దొరకవు. కరోనా లక్షణాల్లో దగ్గు, జ్వరం వంటివి ఉన్నాయి. ఇలాంటి లక్షణాలతో బాధపడే వాళ్ళు మందుల షాపులో మందులు కొనుక్కొని వాడుతున్నారు.దీనిపై తెలంగాణ ప్రభుత్వం ద్రుష్టి పెట్టింది

ఈ మున్డులకు మీ ఫోన్‌ నంబర్‌, చిరునామాను తప్పనిసరిగా ఇవ్వాలి. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి కేటీఆర్‌ నిర్వహించిన వీడియో సమావేశంలో ఆదేశించడంతో అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. ఔషధ దుకాణాల యజమానులు, సంఘాల ప్రతినిధులు, ఫార్మాసిస్టు సంఘాల వారితో సమావేశం నిర్వహించాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ అన్ని నగరపాలక సంస్థలు, పురపాలక కమిషనర్లు, ఉప కమిషనర్లను ఆదేశించారు

Exit mobile version