
S*ex: భార్యాభర్తల కలయికలో చురుకుదనం చాలా కీలకమైనది. పురుషుడు, స్త్రీ ఇద్దరూ ఆసక్తితో శృంగారం ప్రారంభించినప్పుడే అది ఆనందకరంగా ముగుస్తుంది. కానీ కొందరు చివర్లో సంతృప్తి పొందలేకపోతారు. మీరు సరైన విధంగా చేయలేదని భావించడం, మీ భాగస్వామిలో అసహనాన్ని పెంచవచ్చు. ఈ సందర్భంలో తనతో నేరుగా మాట్లాడటం ద్వారా భాగస్వామి మూడ్‌ను మార్చవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. శృంగారం ఎంత అద్భుతమైన అనుభూతి ఇస్తుందో, దానికి సంబంధించిన ప్రతికూలతలు కూడా అంతే ప్రభావవంతంగా ఉంటాయి.
భాగస్వామితో స్పష్టత అవసరం
శృంగార సమయంలో మీ కోరికలు, ఆకాంక్షలను భాగస్వామికి స్పష్టంగా చెప్పడం మంచిది. శృంగారం పూర్తయ్యాక హగ్ చేయడం, కిస్ ఇవ్వడం, వ్యక్తిగత విషయాలను పంచుకోవడం ద్వారా బంధం బలపడుతుంది. కానీ అప్రయోజనమైన మాటలు లేదా విమర్శలు మాట్లాడటం వలన మూడ్ చెడిపోతుంది. ఇవి మీ భాగస్వామి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవచ్చు.
పురుషాంగ పరిమాణంపై విమర్శలు వద్దు
పురుషాంగం పరిమాణంపై అనేక అపోహలు ఉంటాయి. ఈ విషయంపై విమర్శలు లేదా తక్కువచేసే వ్యాఖ్యలు చేయడం పూర్తిగా తప్పు. భార్య లేదా గర్ల్‌ఫ్రెండ్ ఈ విషయం గురించి ప్రతికూలంగా మాట్లాడితే మగవారు అవమానంగా భావిస్తారు. ఇది శృంగారంలో వారి చురుకుదనాన్ని దెబ్బతీస్తుంది.
త్వరగా ముగించమని ఒత్తిడి వద్దు
శృంగారం కేవలం కొన్ని నిమిషాల్లో ముగించాల్సిన పని కాదు. ఇది ప్రేమను బలపరిచే ప్రత్యేక అనుభూతి. మధ్యలో “త్వరగా ముగించు” అని చెప్పడం భాగస్వామికి మనస్తాపం కలిగిస్తుంది. అలాగే ఇది అతనిపై ఒత్తిడి పెంచి అనవసర ఆందోళన కలిగిస్తుంది.
ఫోన్ వినియోగం దూరం పెట్టండి
శృంగార సమయంలో భాగస్వాములు ఒకరినొకరు ప్రేమగా అనుభవించాలి. ఈ సందర్భంలో ఫోన్ ఉపయోగించడం పూర్తిగా మూడ్‌ను పాడుచేస్తుంది. కాబట్టి ఈ సమయంలో ఫోన్‌ను పూర్తిగా పక్కన పెట్టడం మంచిది.
మధ్యలో మాటలు తగ్గించండి
శృంగారానికి ముందే భాగస్వామితో ఏం చేయాలి, ఏం ఇష్టం అనే విషయాలను చర్చించడం మంచిది. కానీ శృంగారం మధ్యలో అనవసరంగా మాట్లాడటం ఆసక్తిని తగ్గిస్తుంది. ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని తగ్గించే అవకాశముంది.
మాజీ లవర్స్ గురించి ప్రస్తావించవద్దు
శృంగారం సమయంలో మాజీ ప్రేమికుల గురించి మాట్లాడటం పూర్తిగా తప్పు. ఇది మూడ్‌ను చెడగొడుతుంది. పైగా గొడవలు లేదా మానసిక ఆందోళనకు దారితీస్తుంది. దీనివల్ల శృంగార జీవితంలో ప్రతికూల ప్రభావాలు ఏర్పడవచ్చు.
