
లాక్ డౌన్ కారణంగా అన్నిటి ఫై ధరలు విపరీతంగా పెంచారు. ఓ పక్క ప్రభుత్వం ధరలు పెంచకూడదని..పెంచితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నప్పటికీ..రవాణా సదుపాయం లేకపోవడంతో అన్నిటికి ధరలు పెరిగాయి. ఇదే అదునుగా మార్కెట్ లో మటన్ ధరను భారీగా పెంచారు. కిలో మటన్ దాదాపు రూ. 1200 చెపుతుండడం తో నాన్ వెజ్ ప్రియులు లబోదిబో మంటున్నారు.
దీంతో తెలంగాణ సర్కార్ మటన్ అమ్మకపు దారులపై సీరియస్ అయ్యింది. ప్రభుత్వమే స్వయంగా రంగంలోకి మాంసం ధరలను ఫిక్స్ చేసింది. కిలో మటన్ ధర రూ.700కే అమ్మాలని స్పష్టం చేసింది. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు పశు సంవర్థక శాఖ ప్రత్యేక కమిటీ కన్వీనర్ డాక్టర్ బాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దుకాణాల ముందు ధర తెలిపే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
