Site icon TeluguMirchi.com

లాక్ డౌన్ ఎఫెక్ట్ : కోతులకు విషం పెట్టి చంపిన కిరాతకులు

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. గత నెల రోజులుగా ఎలాంటి పనిలేకపోవడం తో ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న సహాయం ఏమాత్రం సరిపోక కనీసం తిండి కూడా తినలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ లాక్ డౌన్ మనుషులకే కాదు మూగజీవులకు కూడా కష్టంగా మారింది.

పర్యాటక ప్రాంతాలలో కోతుల బాధలు చెప్పలేని విధంగా ఉంది. వాటికి ఆహారం అందించేవారు కరువయ్యారు. రోడ్డు మీద తిరిగే శునకాలు, వన్యప్రాణులు, పక్షులు, కాకులు ఆకలితో అలమటిస్తుండటంతో కొంతమంది మానవతాదృక్పథంతో వ్యవహరిస్తూ ఆహారం అందిస్తున్నారు.కొంతమంది కిరాతకులు కోతులకు విషం పెట్టి చంపడం తిరువణ్ణామలైలో వెలుగులోకి వచ్చింది. కొందరు కిరాతకులు ఆకలితో అలమటిస్తున్న కోతులకు అరటి పండులో విషం పెట్టి చంపారు. తిరువణ్ణామలై అటవీ ప్రాంతంలో ఓ చోట పది కోతులు మరణించి ఉండటాన్ని గిరిజనులు గుర్తించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Exit mobile version