Site icon TeluguMirchi.com

పుట్టిన బిడ్డను చూడకుండానే కరోనా తో మరణించిన తల్లి ..

కరోనా మహమ్మారి ఎవర్ని వదిలిపెట్టడం లేదు. చిన్న , పెద్ద, ధనిక , పేద ఇలా అన్ని వర్గాల వారు అన్ని జాతుల వారిని సమానంగా చూస్తుంది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా వేల మంది మరణించగా..తాజాగా పుట్టిన బిడ్డను కూడా చేసుకోకుండానే ఓ తల్లి కరోనా తో మరణించడం యావత్ ప్రజలను బాధలో పడేసింది. ఈ ఘటన ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హమ్‌లో చోటు చేసుకుంది.

ఫోజియా హనీఫ్ (29), వాజీద్ అలీ దంపతులకు ఏడేళ్ల క్రితం పెళ్లయ్యింది. గతేడాది హనీఫ్‌కు ఓ బిడ్డ పుట్టి చనిపోయింది. మళ్లీ గర్భం దాల్చడంతో.. ఆ దంపతులు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. డెలివరీ టైం కు వచ్చిన టైములో కొన్ని రోజుల క్రితం ఆమెకు కాస్త జ్వరం రావడం తో ఆమె భర్త హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. రెండు రోజులపాటు హాస్పిటల్‌లో ఉంచి కరోనా పరీక్షలు చేస్తామని డాక్టర్లు చెప్పారు. మరుసటి రోజు కరోనా పాజిటివ్ అని చెప్పారు. కానీ వైరస్ ప్రభావం తక్కువగానే ఉంది కాబట్టి ఇంటికి తీసుకెళ్లొచ్చని చెప్పారు. కానీ ఇంటికి వెళ్లిన నాలుగు రోజుల తర్వాత ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో వెంటనే అంబులెన్స్‌‌లో ఆమెను హాస్పిటల్‌కు తరలించారు.

ఏప్రిల్ 2న సర్జరీ చేసి బాబును బయటకు తీశారు. కానీ పసిబిడ్డకు రిస్క్ అనే ఉద్దేశంతో హనీఫ్‌ను రికవరీ వార్డుకు పంపించి.. బిడ్డను వేరే చేట ఉంచారు. కరోనా కారణంగా బిడ్డను చూడలేకపోయానని బాధపడుతున్న హనీఫ్‌కు.. ఆ చిన్నారి ఫొటోలను చూపించారు. తన బిడ్డ ఫొటోలను చూసి మురిసిపోయిన ఆ తల్లి… కరోనా నుంచి కోలుకోగానే ఇంటికెళ్లిపోవచ్చు అని ఆశపడింది. కానీ ఆ బిడ్డ పుట్టిన ఆరు రోజుల్లోనే ఆమె చనిపోయింది.

Exit mobile version