Site icon TeluguMirchi.com

motog 5g లాంచ్‌


కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలు విలవిలాడిపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. క్రయ విక్రయాలు జరగకపోవడంతో కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి. మొన్నటి వరకు దేశాలన్నీ లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ఇప్పుడిప్పుడే కాస్త ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా చర్యలు తీసుకుంటూ జవసత్వాలను నింపే ప్రయత్నం చేస్తున్నాయి.

ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ కి మోటో తన కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. motog 5g పేరుతో యూకే, యూరప్‌ మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. దీని ధర 349 యూరోలు (మన రూపాయల్లో దాదాపు 30వేలు). అయితే భారత్‌లో ఎప్పుడు విడుదల చేస్తారనేది సంస్థ ఇప్పటివరకు ప్రకటించలేదు.

Exit mobile version