Site icon TeluguMirchi.com

ముంబయిలో ఒక్కరోజే 884 కేసులు


దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబయిలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. ఒక్క ముంబయి మహా నగరంలోనే రికార్డు స్థాయిలో ఈ రోజు 884 కేసులు; 41 మరణాలు నమోదయ్యాయి. దీంతో ముంబయి నగరంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 18396కి చేరింది. ఇప్పటివరకు కరోనా బారిన పడినవారిలో 4806 మంది కోలుకోగా.. 696మంది ప్రాణాలు కోల్పోయారు.

కాగా అధిక జనావాస ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. పాతబస్తీలు, పట్టణాల్లో మురికివాడలపై నిఘా పెంచాలని అధికారుల్ని ఆదేశించింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల అధికారులతో సమీక్ష అనంతరం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

Exit mobile version